Telangana: 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 19, 2023
08:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
పోలీసు అధికారుల రెండవ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం 20 మంది IPS అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తను కొనసాగించింది. రోడ్‌సేఫ్టీ డీజీగా అంజనీకుమార్,ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, రైల్వే డీజీగా మహేష్ భగవత్,సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్,జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా,ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి, సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు, సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్‌చంద్ర, కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ, అప్పా డైరెక్టర్‌గా అభిలాష్, మల్టీ జోన్ ఐజీగా తరుణ్‌జోషి, ప్రొబేషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి