Page Loader
2026 Delimitation: వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెరిగే సీట్ల సంఖ్య ఇదే? ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ది.. 
వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెరిగే సీట్ల సంఖ్య ఇదే?

2026 Delimitation: వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెరిగే సీట్ల సంఖ్య ఇదే? ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ది.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఈ విశాలమైన ప్రక్రియ అనంతరం రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు అధిక లబ్ధి చేకూరనుందని స్పష్టంగా కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికగా జరిగే ఈ పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పెరిగే స్థానాల సంఖ్య ఈ విధంగా ఉండనుంది.

వివరాలు 

జమ్మూ కాశ్మీర్‌లో 9కి పెరగనున్న ఎంపీ స్థానాలు 

భారతదేశ పటంలో పై భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ఎంపీ స్థానాలు 9కి పెరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 4,పంజాబ్‌లో 18,ఉత్తరాఖండ్‌లో 7,హర్యానాలో 18,ఢిల్లీలో 13,ఉత్తరప్రదేశ్‌లో 143, రాజస్థాన్‌లో 50, గుజరాత్‌లో 43, మధ్యప్రదేశ్‌లో 52, జార్ఖండ్‌లో 24, బీహార్‌లో 79, ఛత్తీస్‌గఢ్‌లో 19, పశ్చిమ బెంగాల్‌లో 60, సిక్కింలో 1, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, అస్సాంలో 21, నాగాలాండ్‌లో 1, మణిపూర్‌లో 2, మిజోరంలో 1, త్రిపురలో 2, మేఘాలయలో 2, ఒడిశాలో 28, మహారాష్ట్రలో 70, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 54, కర్ణాటకలో 41, తమిళనాడులో 49, పుదుచ్చేరిలో 1, కేరళలో 20, లక్షద్వీప్‌లో 1, గోవాలో 2, అండమాన్‌లో 1, దాద్రా నగర్ హవేలీలో 2 స్థానాలు ఉండనున్నాయి.

వివరాలు 

543 నుంచి 848కి లోక్‌సభ స్థానాలు 

ఈ మార్పుల ప్రకారం, మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుత 543 నుంచి 848కి పెరగనుంది. ఇందులో ఉత్తరప్రదేశ్-బీహార్‌లలో మాత్రమే 222 స్థానాలు ఉండనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 165, ఇతర రాష్ట్రాల్లో 461 సీట్లు ఉండబోతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేస్తూ దక్షిణాదికి అన్యాయం జరుగదని చెబుతోంది. అయితే, ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయంగా, జనాభా ప్రాతిపదికను కాకుండా ఆయా రాష్ట్రాల ఆదాయ స్రోతాలను పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేయాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.