Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలేజీ వ్యాన్ను ఢీ కొట్టిన ట్రక్కు.. 23 మంది విద్యార్థులు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న కాలేజ్ వ్యాన్ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. కాజీరంగా ప్రాంతంలోని రంగర్జన్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కాలేజ్ వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఘటన జరిగిన సమయంలో వ్యాన్లో 35 మందికి పైగా విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాలు
రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
సహాయక చర్యలను వేగవంతం చేసి, వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశాయి.
తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.