Teachers jobs-Calcutta High court: అక్రమంగా ఉద్యోగాలు పొందారు..డబ్బులు తిరిగి చెల్లించండి: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
పశ్చిమబెంగాల్(West Bengal)లో 2016లో చేపట్టిన టీచర్ జాబ్ నియామకాలపై(Teacher jobs recruitment) కలకత్తా హైకోర్టు (Calcutta High court) సంచలన తీర్పునిచ్చింది. ఆ ఉద్యోగాలన్నీ అక్రమమైనవేనని పేర్కొంటూ వారందర్నీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తాజా తీర్పుతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా 24 వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా వీరు ఉద్యోగాలు పొందారు. ఈ 24 వేలమంది బ్లాంక్ ఓఎమ్మార్ షీట్ల ద్వారా ఉద్యోగాలు పొందారని జస్టిస్ దేబాంగ్సు బసక్ , మహ్మద్ షబ్బర్ రష్దీ ల ధర్మాసనం అంగీకరించింది. వీరు ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా ప్రభుత్వం నుంచి పొందిన జీతంగా పొందిన మొత్తాన్నినాలుగు నెలల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.