Page Loader
Karnataka: చన్నగిరిలో కస్టడీ మరణం.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​.. 25 మంది అరెస్టు 
Karnataka: చన్నగిరిలో కస్టడీ మరణం.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​.. 25 మంది అరెస్టు

Karnataka: చన్నగిరిలో కస్టడీ మరణం.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​.. 25 మంది అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2024
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని దావణగెరెలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడికి సంబంధించి 25 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. శనివారం పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి (ఆదిల్)మరణించిన తర్వాత, ఒక ఛాందసవాద మూకలు చన్నగిరి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశాయి. పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.ఈ ఘటనలో కనీసం 11 మంది పోలీసులు గాయపడ్డారని అధికారి తెలిపారు. కేసును సీఐడీకి అప్పగించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు,ఇప్పటికే ఉన్న వీడియో క్లిప్‌ల ఆధారంగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మూకుమ్మడి దాడికి పాల్పడిన వ్యక్తులపై ఐపీసీ 353,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Details 

పోలీసు కస్టడీలో చనిపోయిన ఆదిల్‌ 

మరోవైపు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన కేసులో ఆదిల్‌ను మే 24న అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించాడు. ఆదిల్ మరణవార్త అతని కుటుంబ సభ్యులకు తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పు పెట్టారు.

Details 

డిప్యూటీ ఎస్పీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు 

అదే సమయంలో పోలీస్ స్టేషన్‌పై దాడి అనంతరం చన్నగిరి డిప్యూటీ ఎస్పీ, సబ్ ఇన్‌స్పెక్టర్‌లు సస్పెన్షన్‌కు గురయ్యారు. పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి డిప్యూటీ ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర ఆదివారం తెలిపారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి ఘటన జరగకూడదన్నారు . ఇందులో నిర్లక్ష్యం కనిపించడంతో విచారణకు ఆదేశించారు.

Details 

హోంమంత్రి పరమేశ్వర్ విచారణకు ఆదేశం 

విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదిల్ గ్యాంబ్లింగ్‌లో పాల్గొంటున్నందున పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జి పరమేశ్వర్ తెలిపారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఎందుకు, ఎలా చనిపోయాడన్నది పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తుందన్నారు.