Page Loader
IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ!
తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ!

IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. తెలంగాణ ఫైనాల్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియమించగా, ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మొత్తం 26 మంది అధికారులకు స్థాన చలనం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా, ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌ పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కా ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నజీద్‌ బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు పంచాయతీరాజ్‌, ఆర్‌డీ కార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా

Details

ఐఎఎస్ అధికారుల బదిలీల వివరాలు

ఆయుష్‌ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి ఫైనాన్స్‌, ప్లానింగ్‌ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంక నల్గొండ కలెక్టర్‌గా హరిచందన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బి.ఎం.సంతోష్‌ మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్‌ మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్‌ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఆర్‌.వి.కర్ణన్‌ సీఎంవో జాయింట్‌ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ