Loading...
Polavaram: పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు.. 36 వేల మెగావాట్ల విద్యుత్
పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు.. 36 వేల మెగావాట్ల విద్యుత్

Polavaram: పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు.. 36 వేల మెగావాట్ల విద్యుత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం 27 ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఉందని,వీటి ద్వారా సుమారు 36,050 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. పోలవరం డ్యామ్‌కు ఎగువన 40 కిలోమీటర్ల పరిధిలో, రిజర్వాయర్‌ కుడి,ఎడమ ఒడ్డుల వెంట ఆరు కిలోమీటర్ల వరకు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలత ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై దిల్లీకి చెందిన ఐ వాల్యూ సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రస్తుతం ఆ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

వివరాలు 

అందుబాటులోకి 960 మెగావాట్ల విద్యుత్

మరోవైపు పోలవరం ప్రాజెక్టులో 80 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 12 జల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను ఏపీ జెన్‌కో ఏర్పాటు చేస్తోంది.

వీటి ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.

ఈ యూనిట్లకు అదనంగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను జెన్‌కో అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 38,460 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్‌పీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

వివరాలు 

ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయవచ్చంటే..

పోలవరం డ్యామ్‌కు ఎగువ ప్రాంతంలో 11 చోట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు నిర్మించేందుకు అవకాశాలున్నాయి.

వీటి ద్వారా సుమారు 27,850 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అధ్యయనంలో అంచనా వేశారు.

ఎడమ ప్రధాన కాలువ వెంబడి నది ప్రవాహంపై ఆధారపడకుండా, ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని మరో రెండు ప్రాజెక్టులను ఏర్పాటు చేయవచ్చు.

వీటి ద్వారా సుమారు 3,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోని రావరాపు సరస్సు నీటిని వినియోగించుకుని మూడు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మించవచ్చని గుర్తించారు.

వీటి మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 5,200 మెగావాట్లుగా అంచనా వేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయవచ్చంటే..

అలాగే వేటజంగలపాలెం వద్ద 600 మెగావాట్లు, గైతులపాలెంలో 1,250 మెగావాట్లు, ఉగ్గిలపాలెంలో 1,200 మెగావాట్లు, మన్యపాలెంలో 2,000 మెగావాట్లు, డొంకాడ సమీపంలో 1,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు తక్షణమే అనుకూల పరిస్థితులున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) రూపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

నీటి నిల్వ సామర్థ్యంతో సంబంధం లేకుండా అధ్యయనం

రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన రిజర్వాయర్లను జెన్‌కో అధికారులు విస్తృతంగా గుర్తించారు.

నీటి నిల్వ సామర్థ్యంతో సంబంధం లేకుండా మొత్తం 113 రిజర్వాయర్లలో పీఎస్‌పీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.

తొలుత ఒక టీఎంసీ కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసే సామర్థ్యమున్న 62 రిజర్వాయర్లను ఎంపిక చేసి ఐ వాల్యూ సంస్థ అధ్యయనం చేపట్టింది.

ఇందుకోసం నిర్దేశించిన ప్రమాణాలతో పాటు గూగుల్‌ ఎర్త్‌, జీఐఎస్‌ (జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) సాంకేతికతలను ఉపయోగించింది.

వివరాలు 

నీటి నిల్వ సామర్థ్యంతో సంబంధం లేకుండా అధ్యయనం

ఇదే విధానంలో మిగిలిన రిజర్వాయర్లపైనా అధ్యయనం కొనసాగిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 103 పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.

వీటిలో ఇప్పటికే 6,530 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. మరో 10,990 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.

ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT