Page Loader
US Deportation:అమెరికా డిపోర్టేషన్‌.. త్వరలోనే స్వదేశానికి మరో రెండు విమానాలు! 
అమెరికా డిపోర్టేషన్‌.. త్వరలోనే స్వదేశానికి మరో రెండు విమానాలు!

US Deportation:అమెరికా డిపోర్టేషన్‌.. త్వరలోనే స్వదేశానికి మరో రెండు విమానాలు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని వేగవంతం చేసిన ఆ దేశ ప్రభుత్వం, ఇటీవల కొంతమంది భారతీయులను స్వదేశానికి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో రెండు విమానాలు భారత్‌కు రాబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 15న ఒక విమానం రానుండగా, అందులో సుమారు 170 నుంచి 180 మంది భారతీయులు ఉంటారని, మరో విమానంలో మరింత మందిని పంపే అవకాశముందని సమాచారం. ఈ డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా, ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ,అమెరికా రూపొందించిన తుది జాబితాలో ఇంకా 487 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది. దీంతో,వీరంతా కూడా త్వరలోనే స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా.

వివరాలు 

మండిపడ్డ పంజాబ్‌.. 

ఇదిలా ఉంటే, అక్రమ వలసదారులను వెనక్కి పంపించే విధానం (Deportation) కొత్తది కాదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. గత 15 సంవత్సరాల్లో మొత్తం 15,756 మంది భారతీయులను డిపోర్ట్‌ చేసినట్లు వెల్లడించింది. 2009లో ఈ సంఖ్య 734 కాగా, 2019లో గరిష్ఠంగా 2,042 మందిని వెనక్కి పంపినట్లు తెలిపింది. ఇక, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడంపై పంజాబ్‌లో రాజకీయ వివాదం చెలరేగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఉద్దేశంతోనే ఈ విమానాలను అమృత్‌సర్‌కు మళ్లించిందని పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా ఆరోపించారు. హరియాణా, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించిన ఆయన, ఈ విమానాలను అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ చేయాలని సూచించారు.