
రాజస్థాన్: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
సాంకేతిక లోపం కారణంగా ఉపరితలంతో పాటు గగనతలం నుంచి ప్రయోగించే మూడు మిస్సైల్స్ మిస్ ఫైర్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
మూడు క్షిపణులు నిర్దేశిత పరిధి దాటి వెళ్లి వేర్వేరు గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
రాజస్థాన్
విచారణకు ఆదేశించిన అధికారులు
సైనికుల ప్రాక్టీస్ సందర్భంగా మిస్సైల్‌లు మిస్ ఫైర్ అయ్యాయని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ తెలిపారు. విచారణ ప్రారంభించామని, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
మిస్ ఫైర్ అయిన రెండు క్షిపణుల శిథిలాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మూడోదాని కోసం పోలీసులు, ఆర్మీ బృందాలు వెతుకుతున్నాయి.
10 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులను సైన్యంలోని నిపుణులు పరీక్షించారు. కానీ సాంకేతిక లోపం కారణంగా అవి వాటి పరిధిని దాటి ఇంకా ఎక్కువ దూరం దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
నాచన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కైలాష్ విష్ణోయ్ ఈ సంఘటనను ధృవీకరించారు.