Page Loader
అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?

వ్రాసిన వారు Stalin
Mar 22, 2023
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం లోతుగా సంభవించిందని యూఎస్‌జీఎస్ పేర్కొంది. భూమి ఉపరితలం నుంచి 187.6 కి.మీలో లోతు భూకంక కేంద్రం కేంద్రీకృమైనట్లు యూఎస్‌జీఎస్ చెప్పింది. చాలా లోతులో భూమి కంపించడం వల్లే ప్రకంపన తరంగాలు విస్తరించినట్లు యూఎస్‌జీఎస్ చెబుతోంది. ఆ తరంగాలు దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకాశ్మీర్ వరకు వెళ్లినట్లు వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌‌లో భూకంపం వస్తే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కదలికలు వచ్చినట్లు పేర్కొంది.

భూకంపం

భూమి లోతులో సంభవించే భూకంపాల వల్ల తక్కువ నష్టం

భూకంపం వల్ల సంభవించే నష్టం అనేది, అది కేంద్రీకృమైన లోతు, పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలంపై ఉద్భవించే భూకంపాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఉపరితలానికి చాలా లోతులో సంభవించే భూకంపాల వల్ల తక్కువ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే లోతైన భూకంపాల తరంగాలు ఉపరితలంపైకి వచ్చే సమయానికి వాటి శక్తిని కోల్పోతాయి. అంతేకాదు లోతైన భూకంపాలు మరింత దూరం వ్యాపిస్తాయి. భూకంప తరంగాలు రేడియల్‌గా ఉపరితలంపైకి కదులుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఆ తరంగాలు శక్తిని కోల్పోతాయి. అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం విషయంలో కూడా అదే జరిగింది. ఈ భూకంపం వల్ల భారతదేశంలో పెద్దగా నష్టం కలిగించేలేదు.