Page Loader
అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు
అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు

అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు

వ్రాసిన వారు Stalin
Mar 16, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్‌ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. మండాలా పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 09:15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో విమానం సంబంధాలు తెగిపోయినట్లు డిఫెన్స్ గౌహతి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మహేంద్ర రావత్ తెలిపారు. హెలికాప్టర్ పర్వత ప్రాంతంలో కూలిపోవడంతో సహాయక చర్యలు చాలా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్

గత ఆరు నెలల్లో హెలికాప్టర్ క్రాష్ కావడం ఇది మూడోసారి

అరుణాచల్ ప్రదేశ్‌లో గత ఆరు నెలల్లో హెలికాప్టర్ క్రాష్ కావడం ఇది మూడోసారి. గతేడాది అక్టోబర్‌లో ఎగువ సియాంగ్ జిల్లాలోని ఓ గ్రామంలో మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అక్టోబర్‌లోనే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో భారత సైన్యానికి చెందిన మరో చీతా హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లు మరణించారు. చైనా సరిహద్దుకు సమీపంలోని జిల్లాలోని ఒక ఫార్వర్డ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.