
గిన్నిస్ వరల్డ్ రికార్డ్: హెలికాప్టర్‌పై వేలాడుతూ ఒక నిమిషంలో 32 పుల్ అప్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్మేనియాకు చెందిన అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు. హమాజాస్ప్ హ్లోయన్ అనే వ్యక్తి హెలికాప్టర్ స్కిడ్‌లపై వేలాడుతూ 1నిమిషంలో 32 పుల్ అప్స్ సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
సాధారణంగా వ్యాయామం చేసే సమయంలో సహచరులతో పుల్ అప్స్ విషయంలో సవాల్ విసురుకోవడం సహజం. అయితే పుల్ అప్స్ హెలికాప్టర్‌పై వేలాడుతూ చేయడం చాలా కష్టం. ఎగురుతున్న హెలికాప్టర్‌పై వైలాడుతూ చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది.
పుల్ అప్స్
బెల్జియన్ అథ్లెట్ రికార్డును చెరిపేసిన హ్లోయన్
2022లో బెల్జియన్ అథ్లెట్ స్టాన్ బ్రూనింక్ 25 పుల్ అప్స్‌తో రికార్డు సృష్టించారు. ఇప్పుడు అతని రికార్డును హ్లోయన్ అధిగమించారు.
పుల్‌అప్స్ కోసం హ్లోయన్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అయితే హ్లోయన్‌కు శిక్షణ ఇచ్చిన అతను కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. పలు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన హోల్డర్ రోమన్ వద్ద శిక్షణ పొందారు.
పుల్ అప్స్ ఇలా చేస్తే కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ సాధించొచ్చా అని చాలా మందికి అనుమానం రావొచ్చు. ఇలాంటి అనేకమైన విచిత్ర ఆటలు, పనులకు ప్రపంచ రికార్డులుగా లిఖించబడ్డాయి. అయితే అందులో మనకు ఏది సరిపోతుందో దాన్ని ఎంపిక చేసుకొని సాధన చేయడం బెటర్.