English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
    పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

    పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

    వ్రాసిన వారు Stalin
    Mar 14, 2023
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహిళా జడ్జిని బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ చేరుకున్నారు.

    ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి 24గంటల్లో ఖాన్ నివాసానికి వెళ్లనున్నట్లు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నారు. ఇప్పటికే ఇస్లామాబాద్ పోలీసులు ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహోర్ చేరుకున్నారు. లాహోర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పంజాబ్ రేంజర్స్, ఫెడరల్ పారామిలిటరీ దళం కూడా అరెస్ట్‌లో పోలీసులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది.

    తోషాఖానా నుంచి బహుమతులను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని విక్రయించడం ద్వారా భారీగా ఆర్థిక ప్రయోజనాలను ఇమ్రాన్ పొందినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

    పాకిస్థాన్

    కోర్టుకు హాజరు కాకపోవడంతో జడ్జి ఆగ్రహం

    గతేడాది ఆగస్టులో తన స్పెషల్ అసిస్టెంట్ గిల్‌కు సంఘీభావంగా ఇమ్రాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ జడ్జి జేబా చౌదరిని బెదిరించినట్లు మాట్లాడారు. ఆమె జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

    ఆ తర్వాత తాను జడ్జికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు ఖాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన రాలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఇమ్రాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

    తోషాఖానా కేసుకు సబంధించి కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టులను తప్పించుకున్నాడు. ఈ నెల ప్రారంభంలో పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి చేరుకున్నప్పుడు వందలాది మంది ఆయన అనుచరులు అడ్డుకున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రధాన మంత్రి

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    పాకిస్థాన్

    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం
    స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది క్రికెట్
    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు క్రికెట్
    టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ క్రికెట్

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? రాజస్థాన్
    banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి నరేంద్ర మోదీ
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్
    Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌‌లో హైలెట్స్ ఇవే బడ్జెట్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025