Page Loader
పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్
పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్

పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్

వ్రాసిన వారు Stalin
Mar 09, 2023
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు. డ్రైవర్‌ను ఖైర్‌పూర్‌లోని అతని ఇంట్లో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడిని హనీఫ్ లెఘారీగా గుర్తించారు. ధరమ్ దేవ్ రాతిని హత్య చేసిన తర్వాత డ్రైవర్ డాక్టర్‌ కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. డాక్టర్ ధరమ్ దేవ్ రాతి హైదరాబాద్ ప్రాంతంలో ప్రసిద్ధ చర్మవ్యాధి నిపుణుడని స్థానిక పత్రిక 'ది నేషన్' నివేదించింది.

పాకిస్థాన్

డ్రైవర్, డాక్టర్ మధ్య గొడవ

ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు వైద్యుడి వంట మనిషి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో వంటగదిలోంచి కత్తి తీసుకున్న డ్రైవర్ ఇంట్లోనే వైద్యుడిని హత్య చేశాడు. నిందితుడిని 24గంటల్లో అరెస్టు చేసినందుకు పాకిస్థాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి జియాన్ చంద్ ఎస్సారానీ పోలీసులను ప్రశంసించారు. అలాగే హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మహిళా విభాగం చీఫ్ ఫర్యాల్ తల్పూర్ హత్యను ఖండించారు. ముఖ్యంగా హిందూ సమాజం హోలీ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు.