పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి
పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు. తుపాకులు, గ్రెనేడ్లతో ఐదుగురు ఉగ్రవాదులు పోలీస్ హెడ్‌క్వార్టర్‌పై విరుచుకుపడ్డారు. వారిలో ఇద్దరు భవనంలోకి ప్రవేశించిన తర్వాత, తమను తాము పేల్చేసుకోగా, మిగిలిన ముగ్గురిని బలగాలు కాల్చివేసినట్లు అసోసియేట్ ప్రెస్ నివేదించింది. అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వంతో 'టీటీపీ' కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించిన నేపథ్యంలో గతేడాది నవంబర్ నుంచి సరిహద్దులో తరుచూ దాడులు చేస్తోంది.
19మంది గాయడినట్లు పోలీసుల వెల్లడి
ఈ దాడి చిన్న చిన్న పేలుళ్లతో ప్రారంభమైందని, ఆ తర్వాత భవనం కాంపౌండ్‌లో భారీ పేలుడు సంభవించి అధికారులు చెప్పారు. సాయుధ ఉగ్రవాదులు టయోటా వాహనంలో పోలీసు హెడ్‌క్వార్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 19మంది గాయపడ్డారు. పోలీసు యూనిఫాం ధరించి ఉగ్రవాదులు లోపలికి చొరబడ్డారని అధికారులు తెలిపారు. కూంబింగ్ ప్రక్రియ తర్వాత ఎంతమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారనే దానిపై స్పష్టమైన సమాచారాన్ని అందిస్తామని అధికారులు తెలిపారు. గత నెలలో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 100 మందికి పైగా మరణించగా 200మందికి పైగా గాయపడ్డారు. దీనికి కూడా తెహ్రీక్-ఈ -తాలిబాన్ పాకిస్థాన్ బాధ్యత వహించింది.