టీవీ ఛానళ్లలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని నిషేధించిన పాకిస్థాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. ఆయన ప్రసంగాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వ్యతిరేక, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలను చేస్తున్నారని, అవి ప్రసారం చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఛానెళ్లను హెచ్చరించింది.
శాంతిభద్రతలకు విఘాత కలగకుండా ఉండేందుకు ఆయన రికార్డులను, లైవ్ ప్రసారాలను పూర్తిగా నిలిపివేయాని ఆదేశించింది.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన ఖరీదైన బహుమతులను దేశ ఖజానా 'తోషఖానా'కు మళ్లించకుండా విదేశాల్లో భారీ ధరలకు వాటిని విక్రయించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పాకిస్థాన్
మంగళవారం ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశం
తోషాఖానా కేసు విషయంలో మూడు సార్లు ఇమ్రాన్ ఖాన్ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వెంటనే అతని అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది.
తోషాఖానా కేసులో అరెస్టు చేసేందుకు లాహోర్ పోలీసులు ఆదివారం ఖాన్ నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ కేసు విచారణ నిమిత్తం మార్చి 7న లాహోర్ కోర్టులో ఇమ్రాన్ ఖాన్ హాజరు కానున్నారు.
ఇమ్రాన్ కోర్టులో హాజరైన అనంతరం ఇమ్రాన్ అరెస్టు చేసే అవకాశం ఉంది.