పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్‌తో పది రోజుల నుంచి పాక్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు అవసరమైన 1.1 బిలియన్ డాలర్ల నిధుల ఒఫ్పందందపై అంతర్జాతీయ ద్రవ్య నిధి మరింత సమయం కోరిందని ఆర్థిక కార్యదర్శి హమద్ షేక్ గురువారం తెలిపారు. గతేడాది వినాశకరమైన వరదల కారణంగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాలు దొరక్క పాక్ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ఐఎంఎఫ్ మధ్య త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి షేక్ రాయిటర్స్‌కి ఒక ప్రకటనలో తెలిపారు.
దివాళా స్థితికి చేరుకున్న పాకిస్తాన్
నిధులను విడుదల చేయడానికి ఐఎంఎఫ్, పాకిస్తాన్‌తో సిబ్బంది స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. వాషింగ్టన్‌లోని IMF ప్రధాన కార్యాలయం నుండి ఆమోదం పొందిన తర్వాత అంగీకరిస్తామని షేక్ చెప్పారు. పెట్రోలు ధరలు పెంచడం, సబ్సిడీలు ఎత్తేయడం, పన్నులను పెంచడం వంటి షరషతులను ఐఎంఎఫ్ విధిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ షరతులకు అంగీకరిస్తే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొనే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 2.9 బిలియన్ డాలర్ల విదేశీమారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 10 రోజలు దిగుమతులకే సరిపోతాయి. ఆ తరువాత పాక్ పూర్తి దివాళా స్థితిలోకి చేరుకుంటుంది