Page Loader
పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు
పెషావర్ మసీదు పేలుడుపై ముమ్మరంగా విచారణ

పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు

వ్రాసిన వారు Stalin
Feb 02, 2023
09:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి, బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న పాకిస్దాన్ ప్రభుత్వం ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేసింది. ఆత్మాహుతి దాడుల్లో భద్రతా సిబ్బంది ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణను పారదర్శకంగా చేపట్టాలని దేశంలోని పౌరులు, పోలీసులు ఆందోళన బాట పట్టారు. మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా, 170 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 97మంది పోలీసులే కావడం గమనార్హం. మరోవైపు ఈ దాడులకు బాధ్యత వహిన్నట్లు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) ప్రకటించింది.

పెషావర్‌

పాకిస్థాన్‌కు పక్కలో బల్లెంలా మారిన 'టీటీపీ' ఉగ్రవాద సంస్థ

ఆత్మాహుతి దాడి జరిగిన మసీదు ఆషామాషీ ప్రదేశం కాదు. ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్స్ పోలీసు ప్రధాన కార్యాలయంతో పాటు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఆ మసీదులో ఉన్నాయి. రెండు ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో భద్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు అంచెల భద్రతను దాటి మసీదులోకి బాంబర్ వచ్చాడంటే, అంతర్గత సిబ్బంది సాయంచేసి ఉండోచ్చా? భద్రతా సిబ్బందే బాంబర్‌గా మారాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల పాలన మొదలయ్యాక పాకిస్థాన్ సరిహద్దులో భద్రత రోజురోజుకు క్షిణిస్తోంది. ముఖ్యంగా అఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని పాకిస్థాన్ ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో పరిస్థితి మరింత ఆందోళకరంగా మారింది. ఒప్పప్పుడు పాక్ పెంచిపోషించిన ఉగ్రవాద సంస్థ టీటీపీ ఇప్పుడు ఆ దేశానికి గుదిబండలాగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెషావర్‌లో నిరసన తెలుపుతున్న పోలీసులు