LOADING...
Telangana: గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ సర్కార్ రూ.3 కోట్ల నిధులు
గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ సర్కార్ రూ.3 కోట్ల నిధులు

Telangana: గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ సర్కార్ రూ.3 కోట్ల నిధులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజా గాయకుడు గద్దర్ ఆలోచనలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. ఈ దిశగా, సికింద్రాబాద్‌లో ఉన్న గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం రాత్రి పాలనాపరమైన అనుమతులతో కూడిన అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. మంజూరైన నిధులను ప్రతియేటా జనవరి 31న గద్దర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల నిధులు