దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు
అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దిల్లీలోని అన్ని కేంద్రీయ కార్యాలయాలూ మూసే ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ ఆఫీసులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెప్టెంబరు 8 నుంచి 10 వరకు G-20 సమావేశాలు జరగనుండగా, సభ్య దేశాల అధినేతల భేటీ 9, 10 తేదీల్లో జరగడం గమనార్హం.