LOADING...
Bus caught fire : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Bus caught fire : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మరువకముందే దేశంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం అగ్నికి ఆహుతైంది. ఈ భయానక ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి తోడి ప్రాంతంలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తున్న బస్సు షాపురా సబ్‌డివిజన్ పరిధిలోని మనోహర్‌పూర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతం వద్దకు రాగానే ప్రమాదం సంభవించింది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్‌ వైర్లను తాకడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించి, వెంటనే మంటలు వ్యాపించాయి.

వివరాలు 

ఘటనాస్థలిలో సహాయక చర్యలు 

మంటలు చెలరేగిన కొద్ది సేపటికే బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, సుమారు 12 మంది గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, రక్షణ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజస్థాన్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం