LOADING...
Telangana: గోల్కొండ కోట-టూంబ్స్‌ రోప్‌వే.. అధ్యయనానికి 3 సంస్థల ఆసక్తి
గోల్కొండ కోట-టూంబ్స్‌ రోప్‌వే.. అధ్యయనానికి 3 సంస్థల ఆసక్తి

Telangana: గోల్కొండ కోట-టూంబ్స్‌ రోప్‌వే.. అధ్యయనానికి 3 సంస్థల ఆసక్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని చారిత్రక పర్యాటక కేంద్రం గోల్కొండ కోట నుంచి టూంబ్స్‌ వరకు నిర్మించనున్న రోప్‌వే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చేందుకు మూడు సంస్థలు ఆసక్తి చూపించాయి. ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన ఖర్చులు,సామర్థ్యం,ఇతర కీలక అంశాలను విశ్లేషించేందుకు HMDA (హైదరాబాద్ మిల్టీడిసిప్లినరీ అథారిటీ) ముందే టెండర్లు ఆహ్వానించింది. ఆ ప్రక్రియలో రైట్స్(RITES),నైట్‌ఫ్రాంక్(Knight Frank),K&J అనే మూడు కంపెనీలు ముందుకు వచ్చాయి. సాంకేతిక బిడ్‌లు సమీక్షించిన తర్వాత ఆర్థిక బిడ్‌లను ఈ నెల 19నతెరవాలని నిర్ణయించబడింది. ప్రణాళిక ప్రకారం,కోట నుంచి టూంబ్స్‌ వరకు సుమారు 1.5కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణం చేయనున్నారు. గోల్కొండ కోట సందర్శించిన తర్వాత పర్యాటకులు ఈ రోప్‌వే మార్గం ద్వారా సులభంగా టూంబ్స్‌ వరకు చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP)మోడల్‌లో అమలు చేయనుంది.