సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ
ఇండియాలోని ఫీల్మ్ ఇండస్ట్రీలకు పైరసీ పెద్ద సమస్యగా మారింది. గతంలో సినిమాల పైరసీలపై అనేక చట్టాలు తీసుకొచ్చినా పైరసీ మాత్రం తగ్గట్లేదు. ఇటీవల పైరసీ మరింత ఊపందుకుంది. సినిమా రిలీజైన రోజే వివిధ వెబ్ సెట్లలో ఆ సినిమా ప్రత్యక్షమవుతోంది. దీంతో నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఎన్నో వెబ్ సెట్లకు బ్లాక్ చేసినా అవి మళ్లీ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెమెంట్ కూడా పైరసీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. తాజాగా ఈ వర్షాకాల సమావేశాల్లో సినిమాటోగ్రఫీని బిల్లును ప్రవేశపెట్టగా.. దీన్ని రాజ్యసభ పాస్ చేసింది.
పైరసీల వల్ల ఏడాదికి రూ.20వేల కోట్లు నష్టం
ఇకపై సినిమాను పైరసీ చేసినా, థియేటర్స్ లో రికార్డు చేసినా మూడు జైలు శిక్షతో పాటు ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులో 5శాతం జరిమానా విధిస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ పైరసీ వల్ల సంవత్సరానికి దాదాపుగా రూ. 20వేల కోట్లు నష్టపోతున్నామని, అందుకే పైరసీని అరికట్టడానికి కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇప్పటివరకు క్లీన్ U, U/A, A సర్టిఫికెట్లను సినిమాలకు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా U/A, S లో మరో మూడు సర్టిఫికెట్లను తీసుకొచ్చారు