LOADING...
Heatstroke: భగ్గుమన్న ఎండలు.. వడదెబ్బ కారణంగా 34 మంది మృతి
భగ్గుమన్న ఎండలు.. వడదెబ్బ కారణంగా 34 మంది మృతి

Heatstroke: భగ్గుమన్న ఎండలు.. వడదెబ్బ కారణంగా 34 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తీవ్రమవడంతో వివిధ ప్రాంతాల్లో మొత్తం 34 మంది మృతిచెందారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనలు పలు జిల్లాల్లో కలకలం రేపాయి. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్‌లో రాజేశ్వర్‌ (52) మృతి చెందగా, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో తాపీమేస్త్రీ శ్రీనివాస్‌ (40), మోరపల్లిలో కర్నె లచ్చయ్య (85) ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం బోరిగాంలో జాదవ్‌ లతాబాయి (54), తలమడుగు మండలం కుచులాపూర్‌లో ఆత్రం రాము (44), ఉట్నూరు మండలం ఘన్‌పూర్‌కు చెందిన కోవ కిరణ్‌కుమార్‌ (27) మృతిచెందారు.

వివరాలు

8 ఏళ్ల చిన్నారి మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన రామినేని మల్లయ్య (75), రామగుండంలో అబ్బాస్‌ఖాన్‌ (53) మృతి చెందగా, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన గైని సంజీవ్, కవిత దంపతుల కుమార్తె కీర్తన (8) కూడా ఎండల ప్రభావంతో ప్రాణాలు కోల్పోయింది. జయశంకర్‌ భూపాలపల్లి మున్సిపాలిటీ విలీన గ్రామం ఆకుదారివాడలో దుర్గం సమ్మక్క (59), కాటారం మండలం మేడిపల్లిలో జెల్ల లస్మయ్య (60), శంకరాంపల్లిలో గాదె సమ్మక్క (65) మృతిచెందారు. వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ పడమరకోటకు చెందిన బండి హరిశంకర్‌ (58), నల్లబెల్లి మండలం ఆసరవెల్లిలో గుగులోతు నరసింహ (55) కూడా ఎండల తీవ్రతకు బలయ్యారు.

వివరాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం తహసీల్దార్‌ బంజారాలో నన్నెబోయిన సత్యం (71), గూడూరు మండలం మచ్చర్లలో కొట్టెం భద్రమ్మ (60), హనుమకొండ జిల్లా కాజీపేటలో వి. వెంకటేశ్‌ (26) ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ముక్కుడుదేవిపల్లిలో దాసరి భిక్షం (65), యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సుంచు శ్రీనివాస్‌ (58) మృతి చెందారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జి. శాంతమ్మ (75), నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన కృష్ణయ్య (45), ఖమ్మం నగరంలో పెనుగొండ వెంకన్న (56), చేకూరి నాగయ్య (55), యార్లగడ్డ గోవర్ధన్‌రావు (70) రోడ్డుపైనే పడిపోయి మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Advertisement

వివరాలు

అవసరమైతే తప్ప బయటికి రావొద్దు

ముస్తఫానగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ షేక్‌ సలీమ్‌ (45), కూసుమంచి మండలం మంగలితండాలో బాదావత్‌ రాములు (76), తేజావత్‌ కేస్లీ (85), కొణిజర్లకు చెందిన పాముల శ్రీను (53), వెంగన్నపాలేంలో మండ గోపయ్య (75), బోటిగూడెంలో మల్లమ్మ (50) చినరాజుపేటకు చెందిన యేసు (40), లింగగూడెం గ్రామానికి చెందిన జనగం రాంబాబు (42), దానవాయిపేటలో దాగం సీతమ్మ (65), తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) కూడా ఎండల తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వరుసగా జరిగిన ఈ మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Advertisement