Darshan : కన్నడ నటుడు దర్శన్‌పై 3991 పేజీల చార్జీషీట్ దాఖలు
కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. బెంగళూరు పోలీసులు ఈ కేసులో 17 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. 231 మంది సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 3991 పేజీల చార్జిషీట్‌ను 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా దర్శన్‌తో పాటు అతని స్నేహితురాలు పవిత్ర గౌడ, మరికొంత మంది నిందితులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ
దర్యాప్తులో పోలీసులు 200 పైగా ఆధారాలను సేకరించారు. దర్శన్ తన అభిమాని రేణుకాస్వామికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 9న బెంగళూరు సమీపంలోని సుమనహళ్లిలో ఒక మురికినీటి కాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. రాఘవేంద్ర అనే నిందితుడు, దర్శన్‌ని కలిసే అవకాశం పేరుతో రేణుకాస్వామిని బెంగళూరు ప్రాంతంలోని ఓ షెడ్డుకు తీసుకువచ్చాడు. అక్కడే అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
నంబర్ వన్ నిందితురాలిగా పవిత్ర గౌడ
రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలిసింది. రేణు స్వామి మర్మావయావాలు తీవ్రంగా గాయపడ్డాయని కూడా నివేదిక వెల్లడించింది. పవిత్ర గౌడ ఈ హత్యకేసులో నంబర్ వన్ నిందితురాలిగా ఉంది. ఆమె రేణుకాస్వామిని హత్యకు ప్రేరేపించి, ఈ నేరంలో పాల్గొన్నట్లు విచారణలో రుజువైందని పోలీసులు వెల్లడించారు.