తదుపరి వార్తా కథనం

బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు
వ్రాసిన వారు
Stalin
Jun 16, 2023
12:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
బంగ్లాదేశ్ సరిహద్దులో వచ్చిన భూకంపం ధాటికి అసోంలోని గువహటితో పాటు ఇతర ఈశాన్య ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
ప్రకంపనలు శుక్రవారం ఉదయం 10.16 గంటలకు వచ్చాయి.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
అంతకుముందు జూన్ 11న, అసోంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చేసిన ట్వీట్
Earthquake of Magnitude:4.8, Occurred on 16-06-2023, 10:16:15 IST, Lat: 24.86 & Long: 91.98, Depth: 70 Km ,Region: Bangladesh for more information Download the BhooKamp App https://t.co/StvqtwyBWj pic.twitter.com/eMr4V47Qjd
— National Center for Seismology (@NCS_Earthquake) June 16, 2023