BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు..
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టించాయి.
ఈరోజు ఉదయం నలుగురు ప్రైవేట్ పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
వెంటనే అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను భద్రతార్థం బయటకు పంపించారు.
నోయిడా పోలీసుల ప్రకారం, బుధవారం ఉదయం స్టెప్ బై స్టెప్ స్కూల్, ది హెరిటేజ్ స్కూల్ నోయిడా, జ్ఞానశ్రీ స్కూల్, మయూర్ స్కూల్‌లకు ఈ బెదిరింపులు మెయిల్ ద్వారా అందాయి.
ఈ సమాచారం అందుకున్న పాఠశాలల యాజమాన్యాలు తక్షణమే అప్రమత్తమై, విద్యార్థులను స్కూల్ ప్రాంగణం వెలుపలికి తరలించాయి. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
వివరాలు
ఘటనపై కేసు నమోదు
సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక దళంతో సంఘటనా స్థలానికి చేరుకుని, పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ బెదిరింపులు అవాస్తవమైనవని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈమెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడ్డవారిని గుర్తించే పనిలో నిపుణుల సహాయంతో ముందుకెళ్తున్నారు.