Kerala: మైనర్ కూతుళ్లపై ఇద్దరు లవర్స్‌తో లైంగికదాడి చేయించిన తల్లి.. 40ఏళ్ల జైలు శిక్ష
Kerala woman jailed for 40 years: కన్న బిడ్డల పట్ల ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోజులో పడి కూతుర్లపై లైంగిక వేధింపులను ప్రోత్సహించింది. ఏడేళ్ల కుమార్తెపై ప్రియుడిని లైంగిక వేధింపులకు ప్రోత్సహించిన ఆ తల్లికి ప్రత్యేక కోర్టు 40ఏళ్ల 6నెలల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది. బాధితురాలి తల్లికి పోక్సో చట్టం కింద శిక్ష పడటం ఇదే తొలిసారి. ఈ ఘటన 2018-2019మధ్య కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగుచూసింది. మానసిక అనారోగ్యంతో ఉన్న భర్తను విడిచిపెట్టిన నిందితురాలు శిశుపాలన్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. ఈ సమయంలో శిశుపాలన్ నిందితురాలి ఏడేళ్ల కూతురిని చాలాసార్లు దారుణంగా వేధించాడు. చిన్నారి ప్రైవేట్ భాగాలపై కూడా గాయాలు చేసాడు.
మరో ప్రియుడు కూడా లైంగిక వేధింపులు
చిన్నారి తల్లి నిత్యం శిశుపాలన్ ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలోనే చిన్నారిని కూడా శిశుపాలన్ ఇంటికి తీసుకెళ్లేది. ఈ క్రమంలో తల్లి సమక్షంలోనే చిన్నారిపై శిశుపాలన్ లైంగిక దాడికి పాల్పడేవాడు. అలాగే, చిన్నారపై ఆ తల్లి మరో ప్రియుడిని కూడా లైంగిక వేధింపులకు ప్రోత్సహించింది. ఇదే సమంయలో చిన్నారి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చింది. తనపై జరిగుతున్న లైంగిక వేధింపులను తన అక్కకు చిన్నారి చెప్పింది. ఈ క్రమంలోనే పదకొండేళ్ల బాలికను కూడా శిశుపాలన్ వేధించాడు. అంతేకాదు, ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ ఆమెను బెదిరించాడు. కొన్నిరోజులకు ఇద్దరు అక్కాచెల్లెల్లు తప్పించుకుని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని అమ్మమ్మకు పూసగుచ్చినట్లు ఇద్దరు చెప్పారు.
శిశుపాలన్ ఆత్మహత్య
చిన్నారుల అమ్మమ్మ వారిని వెంటనే చిల్డ్రన్స్ హోంకు తరలించింది. అక్కడ జరిగిన కౌన్సెలింగ్‌లో అక్కాచెల్లెల్లు ఇద్దరూ జరిగిన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విచారించిన కోర్టు తల్లికి గరిష్ట శిక్ష విధించింది. ఆమె మాతృత్వానికి అవమానకరమని, ఆమె క్షమాపణలకు అర్హురాలు కాదని న్యాయమూర్తి అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తు సమయంలోనే మొదటి నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందువల్ల, తల్లిపై మాత్రమే విచారణ జరిగింది. పిల్లలు ప్రస్తుతం బాలల గృహంలో నివసిస్తున్నారు. ఈ కేసులో ఇరవై రెండు మంది సాక్షులను విచారించగా, ముప్పై మూడు పత్రాలను సమర్పించారు.