LOADING...
Satya Kumar: 104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు
104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు

Satya Kumar: 104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం పాలనలో వ్యయం పెరగడం,లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగడం ఈ మార్పులే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి తెలిపారు. డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ‌ల అమ‌లును, 108, 104 సేవ‌ల‌ను శనివారంనాడు వ‌ర్చువ‌ల్ గా సంబంధిత అధికారుల‌తో మంత్రి వివ‌రంగా స‌మీక్షించారు. ముఖ్యంగా 108 సేవలకు సంబంధించిన టెండర్‌లో కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా కఠిన నిబంధనలను అమలు చేయడం వల్ల సేవల నాణ్యత గణనీయంగా మెరుగ్గా మారిందని తెలిపారు.

వివరాలు 

ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిదారుల సంఖ్య

2022-24 కాలంలో ఆరోగ్యశ్రీ పథకం కింద మొత్తం 23,08,930 మంది లబ్ధిపొందారు. సగటున నెలకు 96,205 మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కింద, గతేడాది డిసెంబర్ వరకు 24,49,117 మంది లబ్ధిదారులకు వైద్య సేవలు అందించారు. సగటున నెలకు 1,16,624 మందికి నగదు రహిత వైద్య సేవలు అందడంతో, లబ్ధిదారుల సంఖ్యలో 21 శాతం వృద్ధి నమోదైంది.

వివరాలు 

108 అంబులెన్స్ సేవల సమర్థత

108 సేవల్లో సానుకూల ఫలితాలు సాధిస్తునట్లు అధికారులు తెలిపారు. జూన్ 2025 నుంచి 108 వాహనాల అగ్రిమెంట్‌లో ప్రత్యేక నిబంధనలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా గోల్డెన్ అవర్ క్రమంలో, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఒక గంటలో రోగిని ఆసుపత్రికి చేరవేయడంలో సక్సెస్‌ రేటు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ కాల్ వచ్చిన తర్వాత సగటున 18 నిమిషాల్లో 108 వాహనం రోగి వద్దకు చేరతుండగా, ప్రస్తుతం సగటున 37 సెకన్ల ఆలస్యం మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్య సమయం 23 నిమిషాలు, సగటు ఆలస్యం 13 సెకన్లు, గిరిజన ప్రాంతాల్లో లక్ష్య సమయం 33 నిమిషాలు, సగటు 2 నిమిషాలు 34 సెకన్లు ముందే రోగి వద్దకు చేరుతోంది.

Advertisement

వివరాలు 

108 సేవల ప్రాముఖ్యత

కూటమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రస్తుతంగా 95.58 శాతం రోగులు సగటున 1 గంట 5 నిమిషాల్లో ఆసుపత్రులకు చేరుతున్నారు. గతంలో ఇదే విధానం లేనందున కేవలం 15 శాతం రోగులు సగటున 1 గంట 57 నిమిషాల్లో చేరగలిగేవారు. 108 టెండర్‌లో కొత్త కఠిన నిబంధనలు 108 వాహనాల టెండర్‌లో కూటమి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసింది. గత ప్రభుత్వంలో 50 కంటే తక్కువ అంబులెన్స్ నడిపినవారికి అవకాశముందని నిర్ణయించగా, కూటమి ప్రభుత్వం కనీసం 100 అంబులెన్స్ నడిపిన అనుభవం ఉండాలన్న నిబంధన పెట్టింది. 800 వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిబంధనలలో సెట్ చేశారు.

Advertisement

వివరాలు 

108 టెండర్‌లో కొత్త కఠిన నిబంధనలు

గత టెండర్‌లో గడచిన 3 సంవత్సరాల్లో ఏటికి 25 కోట్ల ఆదాయం సాధించినవారికి అర్హత ఇచ్చినప్పటికీ, కూటమి ప్రభుత్వం దీన్ని కనీసం 100 కోట్ల వరకు పెంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. ఒక్కో అంబులెన్స్‌కు ఒక EMCT, డ్రైవర్ ఉండాలని నిర్ణయం ఉండగా, కూటమి ప్రభుత్వం రెండు టెక్నీషియన్లు మరియు రెండు డ్రైవర్లు ఉండే విధంగా మార్పు చేసింది. ఫోన్ కాల్ వచ్చిన గంటలో రోగిని 108 వాహనంలో ఆసుపత్రికి చేరవేయాలి అని కొత్త నిబంధన పెట్టారు.

వివరాలు 

104 వాహనాల ద్వారా ఇంటివద్దే వైద్య పరీక్షలు

మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకారం, త్వరలో 104 వాహనాల ద్వారా ప్రతి ఒక్కరికీ 41 రకాల వైద్య పరీక్షలు ఇంటివద్దే అందిస్తారు. ఈ సన్నాహకాలు, వైద్య సేవల నాణ్యత, అమలు పరంగా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.

Advertisement