APSRTC : శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 బస్సులు.. ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు శివ దీక్షాపరులకు స్పర్శ దర్శనం కల్పించనుండగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
Details
ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై ఆర్టీసీ ప్రణాళిక
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేస్తోంది. గతేడాది 382 బస్సులు నడిపినా ఈ ఏడాది రద్దీ పెరగనుందని అంచనా వేసి 453 బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఏఏ జిల్లాల ఎన్ని బస్సులు అంటే?
ఉమ్మడి కర్నూలు జిల్లా - 198 బస్సులు, అనంతపురం జిల్లా - 60 బస్సులు
శ్రీ సత్యసాయి జిల్లా - 45 బస్సులు, కడప జిల్లా - 10 బస్సులు, నెల్లూరు జిల్లా - 60 బస్సులు
చిత్తూరు జిల్లా - 20 బస్సులు, తిరుపతి జిల్లా - 40 బస్సులు, అన్నమయ్య జిల్లా - 20 బస్సులు
Details
కర్నూలు జిల్లాలోని ప్రదేశాల నుంచి బస్సుల వివరాలు
కర్నూలు-1 - 29 బస్సులు, కర్నూలు-2 - 31 బస్సులు, పత్తికొండ - 3 బస్సులు, ఎమ్మిగనూరు - 23 బస్సులు, ఆళ్లగడ్డ - 10 బస్సులు, ఆత్మకూరు - 5 బస్సులు బనగానపల్లి - 10 బస్సులు
డోన్ - 15 బస్సులు, కోవెలకుంట్ల - 14 బస్సులు, నందికొట్కూరు - 18 బస్సులు, నంద్యాల - 16 బస్సులు, ఆదోని - 24 బస్సులు
శైవక్షేత్రాల సందర్శనకు కూడా ప్రత్యేక బస్సులు
శ్రీశైలం మల్లన్న దివ్య దర్శనంతో పాటు మహానంది, యాగంటి, ఓంకారం, గుండ్ల బ్రహ్మేశ్వరం, నగరంలోని జగన్నాథగట్టు, సంగమేశ్వరం వంటి ప్రముఖ శైవక్షేత్రాలకు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తారు.
Details
అదనపు ఛార్జీలు ఉండవు
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలానికి 198 బస్సులు సిద్ధంగా ఉంచామన్నారు.
బస్సుల కండీషన్ పూర్తిగా తనిఖీ చేసి తర్వాతే బయలుదేరేలా ఏర్పాటు చేశామని కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారులు జి. శ్రీనివాసులు, రజియా సుల్తాన్ తెలిపారు.