Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది. లేహ్ ప్రాంతంలో ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాన్ని, కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.
వివరాలు
ఎక్స్ వేదికగా వివరాలను వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరాలను వెల్లడించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.
భూకంపాలు భూమి ఉపరితలం నుంచి వివిధ లోతుల్లో చోటుచేసుకునే అవకాశం ఉందని వివరించింది.
యూఎస్‌జీఎస్ (USGS) డేటా ప్రకారం.. భూమి ఉపరితలం నుంచి 0 నుంచి 700 కిలోమీటర్ల లోతు వరకు భూకంపాలు సంభవించవచ్చని పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చేసిన ట్వీట్
EQ of M: 5.5, On: 13/08/2026 06:05:15 IST, Lat: 36.881 N, Long: 74.402 E, Depth: 10 Km, Location: Leh, Ladakh.
— National Center for Seismology (@NCS_Earthquake) August 13, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/PWjNXlhVk0