Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం
లడఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా పెను ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎల్‌ఏసీ సమీపంలో నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. నదిని దాటుతున్నప్పుడు, నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిందని, దాని కారణంగా ఈ ఐదుగురు సైనికులు కొట్టుకుపోయారని ఆర్మీ అధికారులు చెప్పారు. ఘటన సమయంలో ట్యాంక్‌లో జేసీఓ సహా ఐదుగురు సైనికులు ఉన్నారని రక్షణ అధికారి తెలిపారు. ఒక జవాన్ ఆచూకీ లభించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సైనికుల అన్వేషణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక T-72 ట్యాంక్ కూడా ట్యాంక్ వ్యాయామం సమయంలో ప్రమాదానికి గురైంది