Odisha : ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఘోర ప్రమాదం.. ఫ్లై ఓవర్‌పై నుంచి బస్సు పడి 5గురు మృతి, 38 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు.
గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు.
బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై సోమవారం 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్ నుండి పడిపోయింది.
ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు.
ఒడిశా
కటక్ నుంచి దిఘా వెళుతున్న బస్సు
బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కాగా, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
క్షతగాత్రులు కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మృతులకు సంతాపం వ్యక్తం చేశారు . ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.