
మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
నెల రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబేనెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.
శాంతి ప్రక్రియలో భాగంగా నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని అమిత్ షా ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ఈ నిర్ణయాలు సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
కుకి గిరిజన నాయకులతో జరిగిన సమావేశంలో హింసపై సీబీఐ దర్యాప్తు గురించి కూడా అమిత్ షా మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మణిపూర్
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు
సహాయక చర్యలను వేగవంతం చేయడం, జాతి ఘర్షణల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, శాంతిభద్రతలను మెరుగుపరచడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరించాలని షా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అమిష్ షా మణిపూర్‌కు చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, కేబినెట్, మహిళా సంఘాలు, గవర్నర్, భద్రతా బలగాలు, పరిపాలన అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.