కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 26, 2023
10:24 am
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44పై ఉదయం 7.15 గంటలకు ప్రమాదం జరిగింది. హైవేపై టాటా సుమో కారు ట్రక్కును ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మరణించారని స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన ఒకరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన వారు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి