Page Loader
Patna Hospital: పాట్నా ఆసుపత్రిలోకి పిస్తోళ్ల‌తో ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వ్యక్తులు.. మ‌ర్డ‌ర్ నిందితుడిని షూట్ చేసిన ప్ర‌త్య‌ర్థులు
మ‌ర్డ‌ర్ నిందితుడిని షూట్ చేసిన ప్ర‌త్య‌ర్థులు

Patna Hospital: పాట్నా ఆసుపత్రిలోకి పిస్తోళ్ల‌తో ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వ్యక్తులు.. మ‌ర్డ‌ర్ నిందితుడిని షూట్ చేసిన ప్ర‌త్య‌ర్థులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని పాట్నానగరంలో ఉన్న పారస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఐదుగురు దుండగులు ఆస్పత్రిలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో చందన్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన దుండగులు స్థానికంగా బిల్డర్‌గా పనిచేస్తున్నవారిగా అనుమానిస్తున్నారు. వారి చర్యలకు రియల్ ఎస్టేట్ వ్యవహారాల నేపథ్యంలో సంభంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, గతంలో వారి మీద ఏవైనా నేర కేసులు నమోదైనట్లు ఆధారాలు లేవని గుర్తించారు. చందన్ మినహా ఆస్పత్రిలో మరెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

వివరాలు 

కాల్పుల్లో గాయపడిన బాధితుడు బక్సర్ జిల్లాకు చెందిన చందన్ మిశ్రా

ఈ దుండగుల ఐదుగురు వరుసగా ఆస్పత్రి లాబీలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారు ఆస్పత్రిలోని ఓ గదిలోకి వెళ్లి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గదికి సమీపించేటప్పుడు వారి వద్ద దాచుకున్న తుపాకులను బయటకు తీశారు. కాల్పుల్లో గాయపడిన బాధితుడు బక్సర్ జిల్లాకు చెందిన చందన్ మిశ్రాగా గుర్తించారు. అతని మీద పలు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. చందన్ ఇప్పటికే జైలుశిక్ష అనుభవిస్తూ చికిత్స కోసం పెరోల్‌పై బయటకు వచ్చి ఉన్నాడు. చందన్ ఆస్పత్రి గదిలో ఉన్న సమయంలో ఐదుగురు దుండగులు తుపాకులతో వెళ్లి అతనిపై కాల్పులు జరిపారు.

వివరాలు 

 చందన్ మిశ్రాపై డజన్ల సంఖ్యలో హత్యాయత్నం కేసులు

ఈ ఘటనపై పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ కే శర్మ స్పందిస్తూ.. నేరస్థుడు చందన్ మిశ్రాను బక్సర్ నుంచి భగల్‌పూర్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అతనిపై డజన్ల సంఖ్యలో హత్యాయత్నం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇది ప్రత్యర్థి గ్యాంగ్ పనై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు కార్తికేయ పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో కొందరి ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా ప్రత్యర్థి ముఠాలోని సభ్యులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాట్నా ఆసుపత్రిలోకి పిస్తోళ్ల‌తో వస్తున్న ఐదుగురు వ్యక్తులు