LOADING...
UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం
UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం

UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం

వ్రాసిన వారు Stalin
Feb 12, 2024
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే(Yamuna Expressway)పై ఆగి ఉన్న బస్సును కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు, బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న ఐదుగురు సజీవదహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కారు పూర్తిగా దగ్ధమైంది. బస్సు కూడా కాలిపోయింది. ప్రమాదం వల్ల యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బస్సు, కారు కాలిపోయిన దృశ్యాలు