
Delhi: ఢిల్లీలోని ఆరు ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఇతర పట్టణాల్లోనూ పాఠశాలలకు బాంబు బెదిరింపుల సంఖ్య పెరుగుతోంది. ఒక చోటు బెదిరింపులు వచ్చిన గంటల వ్యవధిలోనే మరికొన్ని పాఠశాలలకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో అధికారులు ఉరుకులు పెడుతూ తనిఖీలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున మరో ఆరు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. వాటిలో ప్రసాద్ నగర్‌లోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ సీనియర్ సెకండరీ స్కూల్, ద్వారకా సెక్టార్ 5లోని బిజిఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, చావ్లా ప్రాంతంలోని రావు మాన్ సింగ్ సీనియర్ సెకండరీ స్కూల్, ద్వారకా సెక్టార్ 1లోని మాక్స్‌ఫోర్ట్ స్కూల్, ద్వారకా సెక్టార్ 10లోని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ స్కూల్తోపాటు మరికొన్ని విద్యాసంస్థలు ఉన్నాయి.
వివరాలు
బాంబ్ స్క్వాడ్‌తో పాటు అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించారు. బాంబు నిర్వీర్య దళాలు (Bomb squad),అగ్నిమాపక శాఖ సిబ్బందిని అక్కడికి తరలించి సమగ్ర తనిఖీలు జరిపిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో నిన్న కూడా ఢిల్లీలోని అనేక పాఠశాలలకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం ఇప్పటికే తెలిసిన సంగతే.