NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Surat building : భారీ వర్షాలకు సూరత్‌లోని అపార్ట్‌మెంట్‌ కూలి 7 గురి మృతి 
    తదుపరి వార్తా కథనం
    Surat building : భారీ వర్షాలకు సూరత్‌లోని అపార్ట్‌మెంట్‌ కూలి 7 గురి మృతి 
    భారీ వర్షాలకు సూరత్‌లోని అపార్ట్‌మెంట్‌ కూలి 7 గురి మృతి

    Surat building : భారీ వర్షాలకు సూరత్‌లోని అపార్ట్‌మెంట్‌ కూలి 7 గురి మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jul 07, 2024
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాల కారణంగా సూరత్‌లోని సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది.

    దీంతో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలను ఆదివారం శిథిలాల నుంచి వెలికి తీశారు.

    మొత్తం 30 అపార్ట్‌మెంట్‌లకు గాను కేవలం ఐదు ప్లాట్లలోనే కొంతమంది నివసిస్తున్నారు. ఈ భవనం శనివారం కుప్పకూలిపోయింది.

    రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఏడు మృతదేహాలను వెలికితీశారు.

    ఆదివారం ఉదయం 6:00 గంటలకు ఏడవ మృతదేహాన్ని వెలికితీశారని ప్రధాన అగ్నిమాపక అధికారి బసంత్ పరీక్ వివరించారు.

    వివరాలు 

    రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి

    రెస్క్యూ ఆపరేషన్ సైట్‌లోని శిధిలాల మధ్య పడి వున్న భారీ పెద్ద కాంక్రీట్ స్లాబ్‌లను తొలగించింది.

    చిక్కుకుపోయిన నివాసితులను కాపాడటానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు అవిశ్రాంతంగా పనిచేశాయి.

    వెలికితీత కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎక్కువ మంది నివాసితులు చిక్కుకోలేదని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు.

    2017లో నిర్మించిన ఈ భవనం కూలిపోయే సమయానికి ఐదు కుటుంబాలు నివసించాయి.

    వివరాలు 

    సూరత్ భవనం కూలిన ఘటనలో మహిళ రక్షించబడింది, 15 మంది గాయపడ్డారు 

    ఈ సంఘటన సమయంలో చాలా మంది నివాసితులు పనిలో ఉండగా, రాత్రి షిఫ్టులలో పనిచేసే చాలా మంది లోపల నిద్రిస్తున్నారని పోలీసు నివేదికలు చెపుతున్నాయి.

    "సుమారు ఐదు ఫ్లాట్లను ఈ ప్రాంతంలోని కర్మాగారాల్లో పనిచేసే వారు ఎక్కువగా నివసిస్తున్నారని ప్రధాన అగ్నిమాపక అధికారి తెలిపారు.

    సహాయక చర్యలు మొదలు పెట్టినపుడు చిక్కుకున్న వారి కేకలు మాకు వినిపించాయి" అని సూరత్ పోలీసు కమిషనర్ అనుపమ్ గెహ్లాట్ తెలిపారు.

    నిర్మాణం జరిగి కేవలం ఎనిమిదేళ్ల కాలం అయినప్పటికీ, భవనంలోని చాలా ఫ్లాట్లు ఖాళీగా శిథిలావస్థలో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూరత్

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    సూరత్

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025