
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
దీపావళి పండుగను పురస్కరించుకుని రైల్వే ఉద్యోగులకు డీఏను పెంచింది. తాజాగా ఈ మేరకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే ఉద్యోగుల డీఏను పెంచేందుకు నిర్ణయించింది. ఫలితంగా ఇప్పటివరకు 42 శాతంగా ఉన్న డీఏ (కరువు భత్యం) 46 శాతానికి పెరిగింది.
దీంతో ఒకేసారి 4 శాతం మేర డియర్ నెస్ అలవెన్స్ సర్క్యులర్‌ను రైల్వే బోర్డు విడుదల చేసింది. పెరిగిన డీఏ 2023 జులై 1న అమల్లోకి వచ్చిందని ఉత్తర్వుల్లో బోర్డు స్పష్టం చేసింది.
కేంద్రం ఆమోదించిన 7వ సీపీసీ(CPC) సిఫార్సుల మేరకు రైల్వే ఉద్యోగులకు డీఏను పెంచామని బోర్డు వెల్లడించింది.
Details
పండుగకు ముందే డీఏ, బోనస్ చెల్లించనున్న కేంద్రం
స్పెషల్ పే వంటి ఇతర భత్యాలు ఈసారి పెరగకపోవడం గమనార్హం. కేవలం కరువు భత్యం మాత్రమే పెరిగింది.
జులై నుంచి అక్టోబర్ నెలకు సంబంధించిన డీఏ బకాయిలు, నవంబర్ 1న జీతంలో అందించనున్నారు.
దీపావళి పండుగకు ముందే ఈ నగదు ఉద్యోగుల చేతికి అందనుంది. ఈ మేరకు ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవలే కేంద్రం దీపావళి బోనస్ పేరిట రైల్వే ఉద్యోగులకు తీపి కబురు అందించింది.డీఏని 4 శాతం పెంచడంతో పాటు రూ. 15 వేల కోట్ల బోనస్‌గా ప్రకటించింది.
దీపావళి బోనస్ గా ఒక నెల బేసిక్ జీతాన్ని, గరిష్టంగా రూ. 7 వేల వరకు, ప్రయోజనం అందనుంది.