తదుపరి వార్తా కథనం

Special Train: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 15, 2024
03:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.
శబరిమల క్షేత్రానికి ప్రయాణించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ నడపబడుతాయని వెల్లడించింది.
వివరాలు
ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి
నవంబర్ 22, 29 తేదీల్లో మౌలాలి (హైదరాబాద్)-కొల్లాం మధ్య రైళ్లు.
నవంబర్ 24, డిసెంబర్ 1 తేదీల్లో కొల్లాం-మౌలాలి మధ్య రైళ్లు.
నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం మధ్య రైళ్లు.
నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం మధ్య రైళ్లు.
దక్షిణ మధ్య రైల్వే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.