Page Loader
Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి.. 
దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి..

Delhi woman raped: దిల్లీలో 85ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. బ్లేడుతో పెదవులు కోసి.. 

వ్రాసిన వారు Stalin
Sep 02, 2023
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ఘోరం జరిగింది. నేతాజీ సుభాష్ ప్రాంతంలో శుక్రవారం 85ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన యువకుడిని 28ఏళ్ల ఆకాష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం శుక్రవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తుండగా జరిగింది. నిందితుడు వృద్ధురాలు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనతంరం ఆమెను కొట్టి.. ఆమె పెదాలను బ్లేడుతో కోశాడు. ఈ కేసుకు సంబంధించి ఇతర వివరాలతో పాటు ఎఫ్‌ఐఆర్ కాపీని అందించాలని డీసీడబ్ల్యూ చీఫ్ దిల్లీ పోలుసులకు నోటీసులు జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చేసిన ట్వీట్