
DAJGUA: ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపిక: దుర్గాదాస్ ఉయికే
ఈ వార్తాకథనం ఏంటి
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి,విద్య,వైద్యం,అంగన్‌వాడీ కేంద్రాల అందుబాటులోకి తీసుకురావడాన్నిలక్ష్యంగా పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభించిన ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 878 గ్రామాలు ఎంపికైనట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే వెల్లడించారు.
ఈ విషయాన్నిలోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఎంపికైన గ్రామాల్లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 521, పార్వతీపురం మన్యం నుంచి 165,ఏలూరు నుంచి 46,శ్రీకాకుళం నుంచి 34గ్రామాలుగా తెలిపారు.
అదే విధంగా,ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లోని 12జిల్లాల నుంచి 517 గ్రామాలు ఎంపికైనట్లు మంత్రి మరో ప్రశ్నకు బదులిచ్చారు.
వివరాలు
రాష్ట్రానికి రెండు ప్రాంతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు మంజూరుకు అర్హత
అయితే, ఈ గ్రామాలకు అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించనందున, నిధులు విడుదల చేయలేదని,రూ.119.47 కోట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉందని మంత్రి తెలిపారు.
ఇక రాష్ట్రానికి సంబంధించిన డ్రైవింగ్ ట్రైనింగ్ సంస్థల అంశంలో,2016లో దర్శి, 2021లో డోన్‌లకు మంజూరు చేసిన ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడీటీఆర్)లు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.
విజయవాడలో ప్రస్తుతం ఒకటే ఐడీటీఆర్ పనిచేస్తోందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఏపీలో కొత్తగా ఐడీటీఆర్‌లు ఏర్పాటుకు అర్హత లేదని ఆయన వివరించారు.
అయితే, రాష్ట్రానికి రెండు ప్రాంతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు మంజూరుకు అర్హత ఉందని తెలిపారు.