Tamil Nādu: మదురై కోర్టు సంచలన తీర్పు.. సాతాన్‌కుళం లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో సంచలనం రేపిన సాతాన్‌కుళం లాకప్ డెత్ కేసులో మదురై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన తొమ్మిది మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం ప్రకటించింది. తూతుకుడి జిల్లాలోని సాతాన్‌కుళం ప్రాంతానికి చెందిన జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను 2020 జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నిర్వహించారన్న ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
తొమ్మిది మంది పోలీసులపై ఉన్నతాధికారులు కేసు నమోదు
అయితే, పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తండ్రీ కుమారులను తీవ్రంగా హింసించడంతో వారి ఆరోగ్యం విషమించి, అనంతరం ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ కేసులో భాగమైన తొమ్మిది మంది పోలీసులపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిగిన సుదీర్ఘ విచారణలో నిందితులపై ఆరోపణలు రుజువవడంతో, మదురై కోర్టు వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.