Chandrababu Naidu: మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ : చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఈ విజయాన్ని భావిస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (తెదేపా) కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
వివరాలు
మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్
ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్.. ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం.
సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమికి 3.6 శాతం ఓట్లు పెరిగాయి.
గొడ్డలి పార్టీ 39.8 శాతం నుంచి 6 శాతానికిపైగా ఓట్లు కోల్పోయిందని చంద్రబాబు వివరించారు.
అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి
కూటమి అభ్యర్థుల సీట్ల సర్దుబాటుపై చాలా శ్రద్ధ పెట్టామని చంద్రబాబు తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వార్‌రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.