NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక

    వ్రాసిన వారు Naveen Stalin
    May 30, 2023
    11:39 am
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక

    దిల్లీలోని షహబాద్‌లో తన ప్రియుడి చేతిలో 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు కొన్ని రోజుల ముందు బాలిక తన ప్రియుడి సాహిల్‌ను బొమ్మ పిస్టల్‌తో భయపెట్టిందనే విషయం బయటకు వచ్చింది. అంతకుముందు బొమ్మ తుపాకీతో బెదిరించడం వల్లే సాహిల్ ఆమెను హత్య చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలో బాలిక శరీరంపై 16 కత్తి పోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉంది.

    2/2

    సాహిల్‌ను 2రోజుల పాటు పోలీసుల రిమాండ్‌కు తరలింపు  

    16ఏళ్ల బాలిక హత్య కేసులో సాహిల్‌‌ను రెండు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు. తన ప్రియురాలైన 16ఏళ్ల బాలికను సాహిల్ దారుణంగా పలుమార్లు కత్తితో పొడి చంపాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కొ న్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరగడం, ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఇక ముగించాలని బాలిక కోరుకోవడంతోనే సాహిల్ కోపోద్రిక్తుడై ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. బాలిక తన చేతిపై మరో వ్యక్తి పేరును పచ్చబొట్టు వేయించుకుందని, అది నచ్చకే సాహిల్ ఆమెను హత్య చేశాడని మరికొందరు చెబుతున్నారు. తాజాగా బొమ్మ తుపాకీ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు మాత్రం, విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    హత్య
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  హత్య
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  నరేంద్ర మోదీ
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్

    హత్య

    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు హర్యానా
    అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు  ఉత్తర్‌ప్రదేశ్
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప

    తాజా వార్తలు

    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  తెలంగాణ
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023