మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంత్రి నివాసం వెలుపల శనివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు కారణంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బంది, ఒక మహిళ గాయపడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఈ సంఘటన ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో జరిగింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి బయట గ్రనేడ్‌ను పేల్చినట్లు వెల్లడించారు. ఈ సంఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తాము ఈ ప్రాంతంలో భద్రతను పెంచామని, నేరస్థులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.