Page Loader
Bomb Threat: ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దిల్లీలో అత్యవసర ల్యాడింగ్
ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దిల్లీలో అత్యవసర ల్యాడింగ్

Bomb Threat: ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దిల్లీలో అత్యవసర ల్యాడింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI 119 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని దిల్లీకి మళ్లించారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా విమానం ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం భద్రతా అధికారులచే తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు.

Details

విమానంలోని ప్రయాణికులు సురక్షితం

అధికారులు అన్ని ప్రామాణిక భద్రతా చర్యలను పాటిస్తూ, ప్రయాణికుల భద్రతను నిర్ధారిస్తున్నారు. విమానం న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి ముంబై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరగా, ఈ బెదిరింపు రావడంతో విమానాన్ని దిల్లీకి దారిమళ్లించారు. ఇదే తరహాలో గత నెలలో కూడా ముంబైకి చెందిన మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.