Page Loader
Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు 
Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు 

వ్రాసిన వారు Stalin
Mar 04, 2024
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాల్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బెదిరింపులు వచ్చిన రెండు పాఠశాలలు ప్రైవేటు స్కూల్స్ కావడం గమనార్హం. ఈ పాఠశాలలను కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌గా, కాంచీపురం జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌గా గుర్తించారు. ఆదివారం రాత్రి పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు ఈ మెయిల్ వచ్చిందని, సోమవారం ఉదయం మరో పాఠశాలకు ఫేక్ కాల్ వచ్చిందని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు చేరుకుని విచారణ ప్రారంభించగా, అధికారులకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పాఠశాలలకు పోలీసులు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్కూళ్లకు అదనపు భద్రత