Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి
దక్షిణ దిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన శనివారం రాత్రి 9.30 గంటలకు జరిగిందని, పియూష్ పాల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా,చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడని వారు తెలిపారు. గురుగ్రామ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న బంటీ నడుపుతున్న బైక్‌ను పియూష్ పాల్ మోటార్‌సైకిల్ ఢీకోట్టినట్లు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. బంటీ వాంగ్మూలం, CCTV ఫుటేజీ ఆధారంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన పియూష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే మంగళవారం సాయంత్రం 6 గంటలకు, పియూష్ పాల్ మరణించాడు.
బంటీ పై కేసు నమోదు
పియూష్ బైక్‌ను బంటీ మోటార్ సైకిల్ వెనుక నుండి ఢీకొట్టిందని పాల్ స్నేహితుడు సన్నీ బోస్ ఆరోపించారు. పీయూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకోని ఆశ్చర్యపోయినట్లు సన్నీ వార్తా సంస్థ PTIకి తెలిపారు. ఆక్సిడెంట్ జరిగిన సమయంలో పియూష్ హెల్మెట్ ధరించాడని సన్నీ తెలిపాడు.పీయూష్ 20 నిమిషాలకు పైగా రక్తపు మడుగులో ఉన్నా కూడా అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. బైక్ టాక్సీ అగ్రిగేటర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు పీయూష్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని సన్నీ చెప్పాడు. బంటీ పై IPC సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్),337(మానవ ప్రాణాలకు హాని కలిగించే చర్యతో గాయపరచడం మొదలైనవి)కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.